Movies‘జనతా గ్యారేజ్’ రికార్డ్‌ని బద్దలుకొట్టిన ‘ధృవ’

‘జనతా గ్యారేజ్’ రికార్డ్‌ని బద్దలుకొట్టిన ‘ధృవ’

Finally, Ram Charan’s latest film Dhruva is storming at USA boxoffice and already breaks one of the NTR’s Janatha Garage record. Read below story to know more details.

అదేంటి..? వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతున్న ‘ధృవ’ సినిమా.. టాలీవుడ్ ఆల్‌టైం రికార్డ్ మూవీల జాబితాలో మూడో స్థానం సంపాదించుకున్న ‘జనతా గ్యారేజ్’ రికార్డ్‌ని ఎలా బద్దలుకొట్టిందని అని అనుకుంటున్నారా! ఓవరాల్‌గా అయితే కాదుకానీ.. ఓ విషయంలో మాత్రం ‘గ్యారేజ్’ కంటే ‘ధృవ’నే ముందుంది. ఆ వివరాలేంటో మేటర్‌లోకి వెళ్ళి తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నట్లే.. యూఎస్‌లో ‘ధృవ’ ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రీమియర్స్ ద్వారా అంచనాలకు తగ్గట్టు వసూళ్లు రాబట్టలేకపోయినా.. ఫస్ట్ వీకెండ్‌లో భాగంగా శుక్రవారం నుంచి అక్కడి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఇక శనివారం అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా $343k వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో.. మొదటి శనివారంనాడు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో నాలుగో స్థానం సంపాదించిన జ‘నతా గ్యారేజ్’ ($283) రికార్డ్ బద్దలైపోయింది. ఇప్పుడిది ఐదో స్థానానికి వెళ్ళిపోగా.. ‘ధృవ’ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. తొలి మూడు స్థానాల్లో ‘అ..ఆ’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ఊపిరి’ సినిమాలు ఉన్నాయి.

అసలు యూఎస్‌లో ఏమాత్రం మార్కెట్ లేని ‘ధృవ’ చిత్రం తొలిసారి అక్కడ వసూళ్ల వర్షం కురిపించడాన్ని బట్టి చూస్తుంటే.. తన మార్కెట్ వ్యాల్యూని పెంచుకోవడం కోసం చరణ్ వేసిన ప్లాన్స్ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తున్నాయి. అవే.. రిలీజ్‌కి ముందు అక్కడికెళ్ళి ప్రమోట్ చేయడం, ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని ప్రీమియర్స్ చూడడం, భారీఎత్తున చిత్రాన్ని రిలీజ్ చేయడం. వీటికితోడు దీనికి పాజిటివ్ టాక్ రావడంతో.. ‘ధృవ’ భారీ వసూళ్లు రాబడుతోంది. టోటల్ రన్‌లో ఈ చిత్రం 2 మిలియన్ క్లబ్‌లో చేరవచ్చునని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

2016లో తెలుగు సినిమాల్లో మొదటి శనివారం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్-5 చిత్రాలు:
1. అ..ఆ : $545K (రూ. 3.68 కోట్లు)
2. నాన్నకు ప్రేమతో : $385K (రూ. 2.60 కోట్లు)
3. ఊపిరి : $361K (రూ. 2.44 కోట్లు)
4. ధృవ : $343K (రూ. 2.32 కోట్లు)
5. జనతా గ్యారేజ్ : $283K (రూ.1.92 కోట్లు)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news