Movies ‘ధృవ’ 1 మినిట్ డైలాగ్ ట్రైలర్.. చితక్కొట్టేసిన రామ్ చరణ్

‘ధృవ’ 1 మినిట్ డైలాగ్ ట్రైలర్.. చితక్కొట్టేసిన రామ్ చరణ్

Ram Charan’s latest movie Dhruva one minute trailer has released which is very impressive. In this video Charan delivers the dialogue in the energetic way and showed his acting skills which mesmerise everyone. This increases the expectations more on this movie. Watch the trailer below.

ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ధృవ’కి సంబంధించి ఓ డైలాగ్ ట్రైలర్‌ని యూనిట్ విడుదల చేసింది. 1 నిముషం నిడివితో ఉన్న ఈ వీడియోలో బిజినెస్‌మేన్ ఒక్కడే అందరి తలరాతని రాస్తాడని బ్రహ్మాండంగా వివరించారు. నిజానికి.. మనుషుల తలరాతని రాసేది రాజకీయ నాయకుడు అయితే, అతను మాత్రం బిజినెస్‌మేన్ చేతిలో కీలుబొమ్మేనన్న నగ్నసత్యాన్ని చెప్పారు. ఈ డైలాగ్‌ని రామ్ చరణ్ తనదైన స్టైల్‌లో ఎనర్జిటిక్‌గా చెప్పి.. ఔరా అనిపించాడు.

అతడు వాయిస్‌లో బేస్, చెప్పే తీరు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. ఈ డైలాగ్ చెబుతున్నప్పుడు మనకు రామ్ చరణ్ కాదు అతను పోషిస్తున్న ‘ధృవ’ క్యారెక్టరే కనిపిస్తోంది. అంత అద్భుతంగా తన నటనా ప్రతిభతో ఈ డైలాగ్‌ని డెలివర్ చేశాడు చెర్రీ. ఆ వీడియో మీరూ చూస్తే.. అతని నటనకు శెభాష్ చెప్పలేక ఉండలేరు. నమ్మశక్యం కావడం లేదా.. అయితే ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news