Specialsఇది రావణుడి దండ యాత్ర..ఢీ-10 ప్రోమో..!

ఇది రావణుడి దండ యాత్ర..ఢీ-10 ప్రోమో..!

ఈటివిలో ప్రసారమవుతున్న ప్రెస్టిజియస్ డ్యాన్స్ షో ఢీ-10 గ్రాండ్ ఫైనల్స్ చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అటెండ్ అయ్యారని తెలుస్తుంది. ఢీ 10 సీజన్ లలో ఎప్పుడు లేని విధంగా ఈసారి గ్రాండ్ ఫైనల్స్ ఏర్పాటు చేశారు. ఇక గెస్ట్ గా వచ్చిన ఎన్.టి.ఆర్ కు సింహాలతో స్వాగతం పలికారు.

ఈ షోలో ఎన్.టి.ఆర్ తన నట విశ్వరూపం చూపేలా రెండు డైలాగ్స్ తో అందరిని అలరించాడని తెలుస్తుంది. వచ్చే వారం ప్రసారమయ్యే ఈ షో ప్రోమో రూపంలో సంచలనం రేపుతుంది. న్యూ లుక్ లో యంగ్ టైగర్ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఫైనల్ విజేత ఎవరు.. ఎవరు ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా ఢీ-10 షీల్డ్ అందుకుంటారో చూడాలి.

సుధీర్, రష్మి టీం మెంటర్స్ గా శేఖర్ మాస్టర్, ప్రియమణి, అని మాస్టర్స్ లు జడ్జులుగా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రదీప్ యాంకరింగ్ చేస్తుండటం విశేషం. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ కు కావాల్సినంత ఎంటర్టైనింగ్ ఇవ్వడంలో ఢీ ఎప్పుడు సక్సెస్ అవుతూ వస్తుంది.

https://youtu.be/G0yV10sK5Yo

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news