ముద్దులతో ముంచెత్తిన శ్రీ దేవి కూతురు

sridevi-daughter

శ్రీదేవి కూతురు జాన్వి హీరోయిన్ గా వస్తున్న సినిమా దడక్. శశాంక్ కైతన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఇషాన్ హీరోగా నటిస్తున్నాడు. జాన్వి తొలి సినిమాగా వస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హిరూ యెష్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

ట్రైలర్ చూస్తుంటే ఇదో క్రేజీ లవ్ స్టోరీగా అనిపిస్తుంది. జాన్వి కపూర్ తొలి సినిమాగా దడక్ చూస్తుంటే ఆమెకు మంచి డెబ్యూ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఇక సినిమాలో జాన్వి లిప్ లాక్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇవన్ని కామనే అయినా మొదటి సినిమాకే జాన్వి లిప్ లాక్ అంటే మాములు విషయం కాదు. శ్రీదేవి మరణించినా ఆమె లెగసీని కంటిన్యూ చేసేలా జాన్వి తెరంగేట్రం చేస్తుంది. మరి తల్లిలా అశేష ప్రేక్షకాభిమానం పొందుతుందో లేదో చూడాలి.

Leave a comment