Gossipsవంశీ - మహేష్ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే...

వంశీ – మహేష్ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే…

ఒన్ నేనొక్క‌డినే, శ్రీ‌మంతుడు ఈరెండూ మ్యూజిక‌ల్ హిట్సే! తాజాగా మ‌రోసారి దేవీశ్రీ ప్ర‌సాద్ మ‌హేశ్ సినిమాకి వ‌ర్క్ చేయ‌నున్నాడు.ప్రిన్స్ మ‌హేశ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. అశ్వనీదత్‌, దిల్‌రాజు నిర్మాతలు. వచ్చే యేడాది ప్రారం భంలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది. కథానాయికగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ దాదాపు ఖాయమైంది.

స్వరాలు అందించే బాధ్యతను దేవిశ్రీ ప్రసాద్‌కి అప్పగించినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భ‌ర‌త్ అను నేను చిత్రంతో య‌మా బిజీగా ఉన్నాడు రాజ‌కుమారుడు. ఈవారమే కొత్త షెడ్యూల్‌ మొదలు కాబోతోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ని రూపొందిస్తోంది చిత్రబృందం.

ఈ సినిమా పూర్త‌య్యాక స్టార్ ప్రొడ్యూస‌ర్లు క‌లిసి నిర్మించే చిత్రం ప్రారంభం కానుంది.మ‌రోవైపు రాజ‌మౌళితో ప‌నిచేసేందుకు కూడా మ‌హేశ్ ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్నాడు. కానీ అందుకు ఇంకొంత కాలం వేచిచూడాల్సిందే!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news