Gossipsఎక్స్ క్లూజివ్: దేవదాస్ కూడా కాపీ సినిమానే..!

ఎక్స్ క్లూజివ్: దేవదాస్ కూడా కాపీ సినిమానే..!

దేవదాస్ సినిమా కథ కాపీ మరక అంటించకుండా చాలా జాగ్రత్త పడ్డారు మేకర్స్. ఇదో బాలీవుడ్ నుండి వచ్చిన కథ అని.. దాన్ని ఐదారుగురు దర్శకులు కలిసి ఈ కథ సిద్ధం చేశారని చెప్పుకొచ్చారు. అయితే దేవదాస్ సినిమా చూశాక తెలిసింది. ఇది రొటీన్ పాత చింతకాయ పచ్చడి కథే అని.
1
నాగార్జున, నాని కాంబినేషన్ అన్న ఒక్క విషయం తప్ప సినిమాలో అసలు ఏమాత్రం కొత్తదనం లేదు అన్నది వాస్తవం. ఇక ఈ సినిమా మళయాల సినిమాకు కాపీ అంటున్నారు. మళయాలంలో మమ్ముట్టి, శ్రీనివాసం కలిసి చేసిన భార్గవచరితం-మమూనమ్ ఖండమ్ అనే సినిమాను యాజిటీజ్ దించేశారు.
1
సినిమాలో అక్కడ మమ్ముట్టి డాన్ గా ఉంటాడు.. శ్రీనివాసం డాక్టర్ గా కనిపిస్తాడు. డాన్ మనసు మార్చేలా డాక్టర్ ఏం చేశాడు అన్నదే కథ. సేం దేవదాస్ సినిమా కూడా ఆ సినిమాకు రీమేక్ అన్నట్టుగా వచ్చింది. చెప్పాలంటే దేవదాస్ మేకర్స్ ఇది కొత్త కథ.. అసలు ఇలాంటి సబ్జెక్ట్ తెలుగులో రాలేదు అన్నట్టు చెప్పారు. కాని సినిమా చూశాక మాత్రం నిరాశపడ్డారు. ఏదో మల్టీస్టారర్ సినిమా కాబట్టి అలా వసూళ్లు వస్తున్నాయి తప్ప సినిమా మాత్రం పెద్దగా టాక్ లేదన్నది ఓపెన్ గా చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news