దేవదాస్ టీజర్.. నాగ్, నానిల రచ్చ మాములు లేదుగా..!

32

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈమధ్యనే రిలీజ్ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ లో ఒక చేత్తో తుపాకి మరో చేత్తో ఫుల్ బాటిల్ తో నాగ్.. పక్కనే నాని సెతస్కోప్ పెట్టుకుని ఇద్దరు బెడ్ మీద నిద్రావస్థలో ఉన్నారు.2

3

ఈ సినిమా టీజర్ కూడా ఇంతే ఇంప్రెసివ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. శతమంతకమణి తర్వాత ఈ సినిమా చేస్తున్న శ్రీరాం ఆదిత్య ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఈ ఇద్దరు స్నేహితులుగా కనిపిస్తారని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ అయితే ఇంప్రెస్ చేయగా సినిమా కూడా అంచనాలకు తగినట్టే ఉండేలా చూస్తున్నారట.
1

Leave a comment