కార్తీ ” దేవ్ [తెలుగు] ” – ఆఫీషియల్ టీజర్.. పిచ్చెక్కిస్తున్న రకుల్..

28

కోలీవుడ్ హీరో కార్తి రజత్ రవిశంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దేవ్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కార్తి బైక్ రేసర్ గా కనిపిస్తున్నాడు. ఎవరికో నచ్చినట్టుగా జీవితాన్న్ని సాగించడం కన్నా తనకు నచ్చినా బ్రతకడం మేలంటూ చెప్పే కుర్రాడి కథగా ఈ దేవ్ సినిమా వస్తుంది.

ఈ సినిమాలో కార్తి లుక్ కొత్తగా ఉంది. గాయ్ నెక్స్ట్ డోర్ గా కనిపించే కార్తి ఈ సినిమాలో స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఖాకి సినిమా తర్వాత రకుల్ మళ్లీ కార్తితో రొమాన్స్ చేస్తున్న సినిమా ఇది. సినిమా టీజర్ అలరించగా ఈ దేవ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పలేదు కాని కార్తి ఈ ఇయర్ లోనే దేవ్ గా వచ్చేలా ఉన్నాడు.

Leave a comment