‘భరత్ అనే నేను’ ఆగిపోతుందా…? కారణాలు ఇవే…

bharat ane nenu

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు సినిమా చిత్ర యూనిట్ మధ్య వచ్చిన విభేదాలు వలన ప్రిన్స్ మహేష్ ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా మహేష్ నటిస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణం రోజు రోజుకు ఆలస్యం అవుతుండడంతో మహేష్ తో సహా అందరూ నిరాశలో ఉన్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సినిమాకు ‘భరత్ అనే నేను’ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాకు రవి కె చంద్రన్ ను సినిమాటోగ్రాఫర్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ కొద్ది రోజులుగా కొరటాలకు, రవి చంద్రన్ కు మధ్య వివాదం తలెత్తడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కొరటాల దర్శకత్వం వహించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా విషయంలో కూడా ఇదే సీన్.

ముందుగా మాథి సినిమాటోగ్రాఫర్ గా ఉండేవాడు. కానీ అతడు తప్పుకోవడంతో ఆ స్థానంలో తిరు వచ్చి చేరాడు.కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం కూడా తిరుని తీసుకోవాలని కొరటాల భావిస్తున్నాడు . ఈ మార్పు చేర్పుల కారణంగా ఈ సినిమా నిర్మాణం ఆలస్యం అవుతోంది. దీనికి తోడు ఈ సినిమాలో ఓ కీలకపాత్ర లో నటిస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా షూటింగ్ కు సక్రమంగా హాజరుకపోవడంతో వంటి కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

Leave a comment