Moviesఫస్ట్ లుక్ ఎక్కడిదో తెలుసా.. దుమ్ముదులిపేయడం ఖాయం..!

ఫస్ట్ లుక్ ఎక్కడిదో తెలుసా.. దుమ్ముదులిపేయడం ఖాయం..!

తారక్ తో త్రివిక్రం కాంబినేషన్ ఎలాంటి అంచనాలతో వస్తుందో జస్ట్ టైటిల్ ఫస్ట్ లుక్ తో చూపించేశారు. మాటల మాంత్రికుడు తారక మంత్రం వేస్తే ఎలా ఉంటుందో రాబోతున్న అరవింద సమేత అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఎన్.టి.ఆర్ డ్యాషింగ్ సిక్స్ ప్యాక్ లుక్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు.

ఎన్.టి.ఆర్ ను ఇలాంటి మాస్ లుక్ లో చూసి చాలా రోజులే అయ్యింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కత్తి పడితే రికార్డులు బద్ధలవ్వాల్సిందే. కొన్నాళ్లు రొటీన్ సినిమాలకు దూరంగా సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్న తారక్ అరవింద సమేత ఫస్ట్ లుక్ తోనే కత్తితో దర్శనమివ్వడం ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.

అయితే ఆ ఫస్ట్ లుక్ యాక్షన్ ఘట్టం లేనిదని తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఉంటాయట. అందుకే తారక్ బాడీ ఫిట్ గా చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఫస్ట్ లుక్ లో ఈ ఫైట్ ముందే షూట్ చేశారంటే ఫైట్స్ కు ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న అరవింద సమేత సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news