రాశీఖన్నాకి టైం అలా కలిసొస్తుందా…?

rashikanna

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తరువాత పక్క ఇండ్రస్ట్రీలవైపు హీరోయిన్ లు చూడడం కామన్. ఈమధ్యకాలంలో వచ్చిన హీరోయిన్ లు అయితే తెలుగు, తమిళ్ రెండు ఇండ్రస్ట్రీలను బేలన్స్ చేసుకుని మరీ నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్, తమన్నా వంటి గ్లామర్ హీరోయిన్ లు తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు రాశిఖన్నా కూడా కోలీవుడ్‌కు క్యూ కడుతున్న భామల లిస్ట్‌లో చేరింది. తాజాగా మలయాళంలో మోహన్ లాల్‌తో కలిసి ‘విలన్’ సినిమాలో నటించిన రాశీ కన్నా ప్రస్తుతం సిద్ధార్థ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్స్‌తో పాటు తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కబోతోన్న భారీ బడ్జెట్ సినిమాలో కథానాయికగా రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

జయం రవి హీరోగా కార్తీక్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమాలో లీడ్ రోల్ కోసం రాశి ని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో జయం రవి క్రేజ్ బాగానే పెరిగింది. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సమయంలోనే అతడి సినిమాలో అవకాశం సంపాదించడం రాశికి నిజంగా అదృష్టమని చెప్పాలి.

Leave a comment