ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ వెనుక ఇంత కథ ఉందా ..?

ntr family trip

ఇప్పటి వరకు సినిమాలతో బిజీ బిజీగా గడిపిన తారక్ ఫ్యామిలీ కోసం కొంచెం టైం కేటాయించాడు. అందుకే సినిమాలకి కొన్ని రోజులు విరామం ప్రకటించి మరీ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేసేశాడు. ఇక్కడ సినిమా సంగతులు అన్ని పక్కన పెట్టి పూర్తిగా తన కుటుంబంతో గడపాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే కొద్ది రోజుల క్రితం యూరప్ వెళ్లిన ఆయన చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్నారు.

సాధారణంగా ఒక స్టార్ హీరో ఇంత కాలం గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వెయ్యడం మొదటిసారి అని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అలాగే .. ఎన్టీఆర్‌కు పెళ్లైన తర్వాత ఫ్యామిలీతో ఇంత బాగా టైం గడపడం కూడా ఇదే మొదటిసారి అట. ఈ ఫ్యామిలీ ట్రిప్ కొంత కాలం క్రితమే వెళ్దామని ప్లాన్ చేసుకున్నారట. కానీ ఎన్టీఆర్ కొడుక్కి వీసా రావడం ఆలస్యం అవ్వడంతో ఈ ట్రిప్ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు.

ఎన్టీఆర్ – డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం అవ్వబోతోన్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా షూటింగ్‌లో త్రివిక్రమ్ తీరిక లేకుండా ఉన్నారు. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరిలో ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభం కానుంది. జై లవకుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ తీరిక అయ్యారు. దీంతో హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. గత రెండు సినిమాల నుంచి ఎన్టీఆర్ ఒకే లుక్‌తో కనిపిస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయబోయే సినిమాకు తన లుక్‌ని ఛేంజ్ చేసేందుకు తారక్ సిద్ధమైయ్యాడు.

Leave a comment