Gossipsసుహాసిని ఓటమి ఎన్టీఆర్ ఫలితమేనా..?

సుహాసిని ఓటమి ఎన్టీఆర్ ఫలితమేనా..?

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమరం ముగిసింది. ఉద్యమ పార్టీనే మళ్లీ గద్దెని ఎక్కించారు తెలంగాణా ప్రజలు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆశయాలను తీర్చేందుకు కె.సి.ఆరే కరెక్ట్ అని మళ్లోసారి ఆయన ప్రభుత్వానికే అందరు మద్ధతు పలికారు. కె.సి.ఆర్ ను ఓడించేందుకు మహాకూటమి అంటూ కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజేఎఫ్ లు కలిసి పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం నుండి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని అభ్యర్ధిగా దించారు. కూటమి సపొర్ట్ తో టిడిపి అభ్యర్ధిగా ఆమె పోటీ చేశారు.
2
ఆమె కోసమే చంద్రబాబు వచ్చి మరి ప్రచారం చేశారు. తెలంగాణా ఎన్నికల ప్రచారానికి బాలాయ్య కూడా వచ్చాడు. సుహాసిని తరపున ప్రచారం చేశాడు బాలకృష్ణ. హరికృష్ణ మరణం వల్ల సానొభూతి ఓట్లైనా ఆమెకు పడతాయని భావించారు. అయితే సుహాసిని కోసం ఎన్.టి.ఆర్ కనుక ప్రచారం చేసి ఉంటే సీన్ మరోలా ఉండేది. నెటి ఫలితాల్లో సుహాసిని టి.ఆర్.ఎస్ అభ్య్ర్ధి మాధవరం కృషారావు మీద ఓడిపోయారు.
1
ఎన్.టి.ఆర్ కనున మహాకూటమి తరపున తెలంగాణాలో ప్రచారం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం తెలంగాణాలో ఉంటూ సినిమాలతోనే బిజీగా ఉంటున్న తారక్ మళ్లీ ఇప్పుడప్పుడే రాజకీయాల ఊసు ఎత్తకూడదనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే అక్క సుహాసిని తరపున ప్రచారానికి నో అని చెప్పాడు. దాని ఫలితంగా రిజల్ట్ తేడా కొట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news