ఎన్టీఆర్ సాక్షిగా ఒకటవుతున్న నందమూరి ఫ్యామిలీ

nandhamuri family

నందమూరి ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చే వార్త ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీ లో చెక్కర్లు కొడుతుంది …కేవలం నందమూరి ఫ్యాన్స్ కే కాదు, సగటు తెలుగు సినీ అభిమానికి సంతోషం కలిగించే విషయం.ఎన్టీఆర్ బాలయ్య ఒకటవబోతున్నారా…అంటే అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా నందమూరి కుటుంబం అంత ఒకటి కానున్నారా అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ప్రధాన చర్చ. ఒక వైపు నుంచి చూస్తే బాలయ్య ఇటు చంద్రబాబు తోను అటు లక్ష్మి పార్వతి తోను సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు.
కానీ జూ.ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ, అన్న కళ్యాణ్ రామ్ తో మాత్రమే గత కొంత కాలం గ సన్నిహితం గ మెలుగుతున్నారు…ఎన్టీఆర్ కి లక్ష్మి పార్వతితో అసలు సత్సంబంధాలు ఉన్నట్టు కనిపించడం లేదు…హరికృష్ణ సైతం ఇంతవరకు లక్ష్మి పార్వతిని కలిసిన దాఖలాలు లేవు..అన్న కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడా అంతే…ఇదే సమయంలో నందమూరి కుటుంబం అంత కలిసి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఒకవేళ ఇది కనుక కార్యరూపం దాలిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరియు బాలయ్య అభిమానులకి పండగే అని చెప్పుకోవాలి…ఇదే సినిమాలో తారక రత్న, నారా రోహిత్ కూడా నటించే అవకాశం ఉందని సమాచారం.
మరి బాలయ్య వారితో పాటు జూ.ఎన్టీఆర్ తో కూడా కలుస్తారా లేదా అనేది సందేహం. ఈ సందేహాలు అన్నీ తొలగిపోయే రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.నందమూరి మరియు నారా కుటుంబాలు కలిసి ఒకేసారి వెండితెర మీద కనిపించబోయే రోజు త్వరలోనే వస్తుందని వేచి చూద్దాం.

Leave a comment