Gossipsబయోపిక్ వెనుక.. అసలేం జరిగింది?

బయోపిక్ వెనుక.. అసలేం జరిగింది?

తేజ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ బాలకృష్ణ హీరోగా అట్టహాసంగా మొదలైన సంగతి తెలిసిందే. అలా మొదలైందో లేదో ఇలా కొద్దిరోజులకే బాబోయ్ ఈ ప్రాజెక్ట్ చేయడం నా వల్ల కాదని చేతులెత్తేశాడు తేజ. కేవలం పని ఒత్తిడి.. అంచనాలను అందుకోలేకనే తేజ ఈ సినిమా నుండి క్విట్ అయ్యాడన్న వార్తలు వస్తున్నా అసలు నిజం మాత్రం వేరే ఉందని తెలుస్తుంది.

సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ 53 గెటప్పులలో కనిపించాలని నిర్ణయించారు. అయితే ఈ 53 గెటప్పులను ఒకే పాటలో లాగించేద్దామని తేజ సలహా ఇచ్చాడట. అలా కాదని తేజతో బాలకృష్ణ వాదనకు దిగాడట. అడవిరాముడిలో ఓ పాట, జయలలితతో ఓ పాట కచ్చితంగా ఉండాలని చెప్పాడట బాలయ్య. దీనికి తగిన సందర్భాన్ని రైటర్లతో కూర్చొని మరి చర్చించాడట.

అంతేకాదు మే 15న ఓ సాంగ్ షూట్ పెట్టుకున్నాడట. ఇదంతా తేజ అయిష్టతోనే జరిగిందట. ఇక ఫైనల్ గా ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేందుకు కూడా వెనకాడలేదు తేజ. తేజ ఎలాగు క్విట్ అయ్యాడు కాబట్టి క్రిష్ కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారట. రాఘవేంద్ర రావు అయితే ఈ ప్రాజెక్ట్ ఆపేయమని సలహా ఇచ్చారట. మొత్తానికి ఎన్.టి.ఆర్ బయోపిక్ కు మొదట్లోనే ఇలా బ్రేక్ పడటం ఫ్యాన్స్ ను నిరాశపరుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news