మెగా అల్లుడు పై సినీ స్కెచ్

mega family
తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీని మెగా హీరోలు  మకుటం లేని మహారాజుల్లా ఏలేస్తున్నారు. అయితే ఇంతటితో సరిపెట్టుకుంటున్నారా అంటే… అదీ లేదు. ఇప్పుడు మరో మెగా ఫ్యామిలీ హీరోని రంగంలోకి దించుతున్నారనే వార్త ఫిలిం నగర్ లో చక్కెర్లు కొడుతోంది. చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ ని రంగంలోకి దించేందుకు మెగా ఫ్యామిలీ పెద్ద స్కెచ్చే వేసింది. అయితే అది రోజు రోజుకి ఆలస్యం అవుతూ వస్తోంది. అప్పుడెప్పుడో దీపావళి నాటికి ఎంట్రీ ఇస్తాడని మెగా అభిమానులు ఆశపడ్డారు. అయితే అది కాస్తా బెడిసికొట్టిందేమో మళ్లీ ఆ ఊసే లేకుండా పోయింది. దీపావళి వెళ్ళిపోయింది. సంక్రాంతి వచ్చేస్తోంది అయినా ఆ ఊసే లేదు.
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ ఫిల్మ్‌ ఇండస్ర్టీ ఎంట్రీ ఎప్పుడు? దీపావళి తర్వాతే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మెగా క్యాంప్ స్కెచ్ వేసిందంటూ ఆ మధ్య ఒకటే వార్తలు. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదుగానీ దీపావళి అయిపోయింది.. సంక్రాంతి వచ్చేస్తోంది. ఇంతకీ కళ్యాణ్ విషయం ఏమైంది? దీనిపై మెగా ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సినిమాల్లోకి వచ్చి ఇండ్రస్ట్రీలో తానేంటో నిరుపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఆ విషయాన్ని తన మామ చిరుకి కూడా చెప్పడం , దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కళ్యాణ్ ఇక ఇండ్రస్ట్రీలో పాగా వెయ్యడానికి స్కెచ్ వేసుకున్నాడు.
ఆయన సూచన మేరకు నటన, మార్షల్ ఆర్ట్స్, డాన్స్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పటికే ఓ మాంచి స్టోరీని చిరు, చరణ్‌లు విన్నట్లు, దాన్ని ఒకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ‘జత కలిసే’ ఫేం డైరెక్టర్ రాకేశ్ శశితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. స్టోరీ విషయంలో చిరుని రాకేశ్ ఒప్పించగలిగితే కల్యాణ్ జనవరిలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు దీనికి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. మరోవైపు చిరు ‘సైరా’లోనూ కల్యాణ్‌కి అదిరిపోయే రోల్ ఇచ్చినట్టు ఇంకోవైపు మెగా ఫ్యామిలీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మెగా హీరో ఇండ్రస్ట్రీలో పాతుకుపోతాడో లేదో చూద్దాం.

Leave a comment