మెగా ఫ్యాన్స్ మళ్లీ హర్టయ్యారు.. బన్ని ఏదోటి చేయవయ్యా..!

details-about-mega-family

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ నెల 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు. రాం చరణ్ నట విశ్వరూపం చూపించేలా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసి రాజమౌళి సైతం చిట్టిబాబు మీద ప్రేమ పెరిగిపోయిందని అనేశాడు.

ఇక మెగా హీరో వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ కూడా రంగస్థలం ట్రైలర్ పై తమ కామెంట్ చేశారు. కాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ అందించలేదు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కు కాస్త దూరంగా ఉంటున్న బన్ని ఈ సినిమా ట్రైలర్ పై స్పందించకపోవడం ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తుంది. అందుకే బన్ని మీద మళ్లీ విమర్శలు మొదలు పెట్టారు.

అసలైతే రెస్పాన్స్ అందించాల్సి ఉన్నా సరే నా పేరు సూర్య సినిమా పూర్తి చేసే పనిలో బన్ని బిజీగా ఉండటం వల్ల ట్రైలర్ పై తన స్పందన తెలియచేయలేదు. ఇది అదునుగా చేసుకుని బన్నిపై మెగా ఫ్యాన్స్ ఎటాక్ మొదలు పెట్టారు. మరి బన్ని ఇప్పటికైనా సరే స్పందిస్తాడో లేదో చూడాలి.

Leave a comment