పోకిరీ పిల్లకి మహేశ్ ఎవరో తెలియదట!

mahesh babu

మాకీ కిరికిరి అని అనుకోకుండ్రి.నిజంగానే పోకిరీ పిల్ల‌కు ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఎవ‌రో అన్న‌ది తెలియ‌ద‌ట‌! అస‌లు ఆ సినిమా సైన్ చేసినా కూడా గ్లామ‌ర్ ప్ర‌పంచం అంటే ఏంటో పెద్ద‌గా  అర్థం అయ్యేది కాద‌ట‌! ఇంకా ఇలియానా ఏమంట‌న్న‌దంటే..చిన్న‌ప్ప‌టి నుంచి అనేకానేక క‌ల‌లు ఉండేవ‌ని ప్ర‌పంచాన్ని చుట్టేద్దామ‌న్న త‌లంపులో భాగంగానే ఎయిర్ హోస్టెస్ కావాల‌ని అనుకున్నాన‌ని చెప్పింది.

16 ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ చిన్న‌ది అటుపై పోకిరితో టాలీవుడ్ లో టాప్ హీరోయ‌న్ రేంజ్‌కి చేరుకుంది. పోకిరీ సినిమా చేసేదాకా అసలు అప్పట్లో నాకు మహేశ్‌ అంటేనే తెలిసేది కాదని, అసలు సినిమా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికే చాలా కాలం పట్టిందని చెప్పింది.ఏళ్లు గడుస్తున్న కొద్ది నేను చేసే పనిపై గౌరవం, ప్రేమ పెరిగాయ‌ని చెప్పిందీమె.

కాగా బీటౌన్‌లో ఆమె నటించిన ‘బాద్‌షాహో’ చిత్రం విడుదలై మంచి విజయం అందుకోవ‌డంతో ఈమె ఆనందానికి అవధి లేకుండా పోతోంది.దీంతో ఇప్పుడు ముంబై వీధుల్లో వ‌రుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు మరోసారి మహేశ్‌బాబుతో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్న స‌మాచారం.

Leave a comment