25 వ చిత్రానికి కూడా ‘స్పైడర్’నే ఫాలో అవుతున్న మహేష్

mahesh babu

ఒక్కోసారి అదృష్టం అంటే ఇలానే ఉంటుంది. చెప్పి రాదు.. ఉండిపోదు.. ఊసుపోనీయ‌దు కూడా! ఒక్కోసారి ఊహ‌లు  నిజ‌మైతే ఇంకా బాగుంటుంది.ర‌కుల్ ఇప్పుడు ఇలానే ఫుల్ టు బిందాస్ అంటోంది. మ‌హేశ్‌తో మరోసారి  తెర పంచుకునే ఛాన్స్ రావ‌డంతో ఈ రాకుమారి తెగ ఆనంద ప‌డిపోతుంది. స్పైడ‌ర్ లో మ‌హేశ్ ని రొమాన్స్ చేసేందుకు ఎంతగా క‌వ్వించిందో ఇప్పుడు అంత‌కు రెట్టించి త‌న చూపుల ఇంద్ర‌జాలంలో ప‌డేస్తానంటోంది.

ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతోన్న మహేష్ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. మహేష్ బాబు 25వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపించింది.

కానీ తాజా సమాచారం ప్రకారం.. దర్శక నిర్మాతలు రకుల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమెకు కోటికి పైగా పారితోషికం కూడా ఆఫర్ చేశారట!దీంతో ఈ అందాల ముద్దుగుమ్మ ఆనందానికి అవ‌ధులే లేవు.

Leave a comment