Gossipsసింహం సిద్ధమవుతోంది... ఇక రికార్డుల చెడుగుడే..!

సింహం సిద్ధమవుతోంది… ఇక రికార్డుల చెడుగుడే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయిందని నిర్మాత వెళ్లడించారు. నయనతారతో ఓ సాంగ్, మరో హీరోయిన్ నటాషా దోషితో పూర్తి అయ్యిందని. ఇక సినిమా ఆడియోని ఈ నెల చివరన రిలీజ్ చేసి జనవరి 12న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

బాలయ్య ఎనర్జీ పర్ఫార్మెన్స్.. రవికుమార్ డైరక్షన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయని అంటున్నారు. 100 సినిమాలను పూర్తి చేసుకున్న బాలయ్య తన సినిమాల వేగం పెంచాడని చెప్పొచ్చు. జై సింహా అలా పూర్తి చేశాడో లేదో మరో సినిమాకు సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం కథల చర్చల్లో ఉండగా త్వరలో బాలకృష్ణ తర్వాత సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట.

షూటింగ్ పూర్తి చేసుకున్న జై సింహా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అనుకున్న విధంగా పూర్తి చేసుకుని జనావరి 12కి గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. బాలయ్య సత్తా ఏంటో మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news