Gossipsబన్ని కన్ఫాం చేశాడు.. ఇక అక్కడ బాక్సులు బద్ధలే..!

బన్ని కన్ఫాం చేశాడు.. ఇక అక్కడ బాక్సులు బద్ధలే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బన్ని చేసే సినిమా మీద క్లారిటీ రాలేదు. లింగుసామి, విక్రం కుమార్ ఇద్దరిలో బన్నితో తర్వాత సినిమా చేసేది ఎవరు అన్న విషయంపై కొంత తర్జన భర్జన ఉంది. అయితే వాటినన్నిటిని పటాపంచలు చేస్తూ బన్ని తన తర్వాత సినిమాను కోలీవుడ్ డైరక్టర్ లింగుసామితో కన్ఫాం చేశాడట.

స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో కె.యి.జ్ఞానవెల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తారట. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. మెగా అభిమానుల అండదడలతో స్టైలిష్ స్టార్ గా ఎదిగిన బన్ని ఇప్పటికే కేరళలో తన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు తమిళంలో తన మార్కెట్ మీద కన్నేశాడు బన్ని.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమా బాక్సులు బద్ధలవడం ఖాయమే అంటున్నారు. వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news