సీరియస్ గా ఖుష్బూ .. ఆమె వెనుక అజ్ఞాతవాసి !

agnathavasi poster

సినిమా ఇంకా విడుదల కాకుండానే అజ్ఞాతవాసి సినిమా అభిమానుల్లో ఎంతో ఆసక్తి పెంచడమే కాకుండా సరికొత్త రికార్డులు తిరగరాసేందుకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం తెలిసినా అభిమానులు ఆసక్తిగా వాటి గురించి తెలుసుకుంటున్నారు. అందుకే అభిమానులను అలరించేందుకు అజంతవాసి సినిమాకు సంబంధించి ఓ స్టిల్ బయటకు వచ్చింది. అదే ఆ సినిమా పోస్టర్. దాన్ని చూస్తే చాలు చాలావరకు పవన్ క్యారెక్టర్ ఏంటో ఇట్టే కనిపెట్టేయవచ్చు.

తాజాగా ఈ పోస్టర్ ని సీనియర్ నటి ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతా నుండి రిలీజ్ చేశారు. ఇంతకాలం ఇటువంటి విలువైన పాత్ర కోసం ఎదురుచూశానని అటువంటి పాత్రను తనకు ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అని ఖుష్బూ తెలిపారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందని, పవన్ చాలా సరదాగా ఉండడమే కాకుండా మంచి మనిషి అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.

ఆ పోస్టర్‌లో ఖుష్బూ కుర్చీలో కూర్చొని హుందాగా సీరియస్ లుక్ లో కనిపిస్తుంటే… ఆమె వెనుక పవన్ కళ్యాణ్ నిలబడి ఉండటాన్ని బట్టి ఈ సినిమాలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటో ఇట్టే అర్ధం అవుతోంది. . ఇక నిన్న విడుదల చేసిన టీజర్‌లో ఖుష్బూ‌ను ఒక్క ఫ్రేమ్‌లో కూడా చూపించలేదు త్రివిక్రమ్. అయితే వెనుక నుంచి సింగిల్ ఫ్రేమ్‌లో ఈమే ఖుష్బూ అన్నట్లు సినిమా స్టిల్ ని రిలీజ్ చేశారు.636491298546235337

Leave a comment