Moviesశ్రీనువైట్లకు ఇదైనా కలిసి వచ్చేనా?

శ్రీనువైట్లకు ఇదైనా కలిసి వచ్చేనా?

చిన్న సినిమాలతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి చిరంజీవి, నాగార్జున, మహేష్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన శ్రీనువైట్ల కెరీర్‌ అయోమయంలో పడింది. వరుసగా ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్‌  ఫ్లాప్‌ అవ్వడంతో శ్రీనువైట్లతో సినిమాలు చేసేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. కాని తనకు బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడు అనే విశ్వాసంతో రవితేజ ధైర్యం చేసేందుకు ముందుకు వచ్చాడు. త్వరలోనే రవితేజ, శ్రీనువైట్లల కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది అనుకుంటున్న సమయంలో ఆ సినిమా ఇప్పుడు కాదనే ప్రకటన వచ్చింది.

శ్రీనువైట్ల ప్రస్తుతం సినిమాల గురించి ఆలోచించడం మానేసి బుల్లి తెరపై దృష్టి పెట్టాలని ఫిక్స్‌ అయ్యాడు. ప్రస్తుతం అన్నిచోట్ల కూడా వెబ్‌ సిరీస్‌ల హవా కొనసాగుతుంది. తెలుగులో ఇప్పటికే పలు వెబ్‌ సిరీస్‌లు వచ్చాయి, కొత్తగా పలు వెబ్‌ సిరీస్‌లు రాబోతున్నాయి. స్టార్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెడుతున్న సమయంలో శ్రీనువైట్ల కూడా వెబ్‌ సిరీస్‌ను చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.

త్వరలోనే ఒక యువ హీరోతో వెబ్‌ సిరీస్‌ చేస్తాను అంటూ ప్రకటించాడు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న వెబ్‌ సిరీస్‌తో దర్శకుడిగా తన సత్తా చాటి అప్పుడు సినిమా చేయాలనేది శ్రీనువైట్ల ప్లాన్‌గా తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news