మహానటిలో మిస్సమ్మ.. అబ్బో సావిత్రిని మరపించింది..!

delated-video-in-mahanati-movie

సావిత్రి జీవిత కథతో వచ్చిన మహానటి సినిమా వసూళ్ల హంగామా గురించి తెలిసిందే. రిలీజ్ అయిన నాటి నుండి బీభత్సమైన మౌత్ టాక్ తో దూసుకెళ్తున్న మహానటి సినిమా నుండి కొన్ని సీన్స్ రన్ టైం కారణం చేత ట్రిం చేయాల్సి వచ్చింది. అందులోనే ఒకటి మిస్సమ్మ నుండి రావోయి చందమామ పాట.

సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాక మహానటి డిలీటెడ్ సీన్స్ అని ఆ పాటని రిలీజ్ చేశారు. సావిత్రిగా కీర్తి నటన అబ్బో సావిత్రిలా కాదు సావిత్రిని మరపించేలా చేసిందంటే నమ్మాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఛ.. ఈ పాట సినిమాలో ఎక్కడో ఓ చోట పెడితే బాగున్ను అనిపిస్తుంది.

సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి వెంట మహానటి వెంట వస్తుంది. జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ నటించగా సావిత్రి కథను రాసే జర్నలిస్ట్ గా సమంత, ఆంటోనిగా విజయ్ దేవరకొండ నటించడం జరిగింది.

Leave a comment