ఆ దర్శకుడి కెరియర్ నాశనం చేస్తున్న నాగార్జున..!

nagarjuna and chinni krishna

పరిశ్రమలోకి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసే వారిలో నాగార్జున ఒకరు. అలాంటి నాగార్జున ఓ దర్శకుడి కెరియర్ ను నాశనం చేయడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు కాని పరిస్థితులు చూస్తే అదే నిజం అని నమ్మాల్సి వస్తుంది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన మూవీ సోగ్గాడే చిన్ని నాయనా. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో మొదటి సినిమానే సూపర్ హిట్ కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున నిర్మాతగా తనయుడు నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తీశాడు కళ్యాణ్ కృష్ణ. ఆ సినిమా కూడా తన మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశాడు కళ్యాణ్ కృష్ణ. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో మూడు సినిమాల అగ్రిమెంట్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమా తీయాలని చర్చల్లో ఉంది. అయితే ఆ సినిమా ఏమాత్రం ముందుకు కదలట్లేదట.

ఓ పక్క కళ్యాణ్ కృష్ణ రవితేజకు ఓ అదిరిపోయే కథ సిద్ధం చేసి అతని మెప్పు పొందినా నాగార్జున అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఎలా ఇతర సినిమా చేస్తావని అంటున్నాడట. ఇదో రకంగా కళ్యాణ్ కృష్ణ కెరియర్ భంగం కలిగించడమే అని చెప్పాలి. పోని బంగార్రాజు కథ ఫైనల్ చేస్తున్నాడా అంటే మార్పులు చేర్పులతోనే కాలం వెళ్లదీస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి కళ్యాణ్ కృష్ణ కెరియర్ కు నాగార్జున అడ్డుగా మారాడు మరి ఈ వ్యవహారం ఎలా సర్ధుమనుగుతుందో చూడాలి.

Leave a comment