Gossipsకృష్ణ‌వంశీతో త‌గాదా పెట్టుకున్న కుర్ర‌హీరో

కృష్ణ‌వంశీతో త‌గాదా పెట్టుకున్న కుర్ర‌హీరో

సందీప్ కిష‌న్ ఒక‌ప్పుడు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన కుర్రాడు
వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ తో మంచి స‌క్సెస్ కొట్టి ఫాంలోకి వ‌చ్చాడు. అటుపై
మ‌రికొన్ని చిత్రాల‌లో కూడా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.
కానీ ఆయ‌న కెరీర్ ని ఓ సినిమా బాగా దెబ్బతీసింది.
న‌క్ష‌త్ర సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న పేరంతా పోయింది.
ఈ విష‌య‌మై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నక్షత్రం’ తేడా కొడుతుందని తనకు ముందే తెలిసిపోయింద‌న్నాడు. ఈ సినిమా ట్రైలరే తనకు నచ్చలేదని, ఇదే సంగ‌తి కృష్ణవంశీకి చెబితే.. ఆయన తిట్టాడని వెల్లడించాడు.ఈ సినిమా కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా చాలా ప్రమాదకర యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు సందీప్ వెల్లడించాడు.ఇక తాను స్క్రిప్టులో ఎక్కువ జోక్యం చేసుకుంటానన్న విమర్శలపై స్పందిస్తూ.. మూడేళ్ల కిందటి వరకు తాను దర్శక నిర్మాతల్ని సినిమా విషయంలో అనేక ప్రశ్నలు అడిగేవాడినని.. కానీ అలా ప్రశ్నించడం మానుకున్నాకే తన కెరీర్లో వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయని అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news