Moviesడియ‌ర్ కామ్రేడ్ కాదు.. డియ‌ర్ క్రికెట్ అని పెట్టాల్సింది... ప‌బ్లిక్ టాక్‌

డియ‌ర్ కామ్రేడ్ కాదు.. డియ‌ర్ క్రికెట్ అని పెట్టాల్సింది… ప‌బ్లిక్ టాక్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా నాలుగు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్‌తో పాటు మిక్స్‌డ్ రివ్యూలు వ‌చ్చాయి. కొంత మంది బాగుంద‌ని చెపుతున్నా క‌థ‌లో కొత్త‌ద‌నం లేద‌ని… నెరేష‌న్ చాలా స్లోగ‌గా ఉంద‌ని చెపుతున్నారు. మ‌రి కొంత‌మంది మాత్రం హీరో, హీరోయిన్ల ప్రేమ‌క‌థ‌, కాలేజ్ ఎపిసోడ్‌, విజ‌య్ – ర‌ష్మిక కెమిస్ట్రీ బాగున్నాయ‌ని చెపుతున్నారు.

ఎక్కువ మంది ప్రేక్ష‌కులు మాత్రం సినిమా ఫ‌స్టాఫ్ వ‌ర‌కు బాగానే ఉంద‌ని మంచి మార్కులే వేస్తున్నారు. సెకండాఫ్‌లో చాలా సీన్లు సాగదీసిన‌ట్టుగా ఉన్నాయ‌న్న కంప్లెంట్లే ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. ఇక చివ‌రి 15 నిమిషాలు బాగుందంటున్నారు. మంచి సందేశాత్మ‌క‌త‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌డం కూడా బాగుంద‌ని కొంద‌రు చెపుతున్నారు.

కొంద‌రు మాత్రం చాలా ల్యాగింగ్ అయ్యింద‌ని కొంద‌రు అంటుంటే… మ‌హిళ‌ల ప‌ట్ల సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీ ఎలా ఉండాల‌నే సందేశం బాగుంద‌ని కొంద‌రు చెపుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం భారీ హైప్‌తో వెళితే ఇబ్బందే అని… అంచ‌నాల‌కు త‌గిన‌ట్లు సినిమా లేదంటున్నారు. హీరో, హీరోయిన్ ఇమేజ్‌ను ద‌ర్శ‌కుడు ప‌ట్టుకోలేక‌పోయాడ‌ని…. ఆ గొడ‌వ‌లేంట్రా బాబూ అనిపిస్తుంద‌న్నారు.

కొంద‌రు టైటిల్‌కు, స్టోరీకి సంబంధం లేద‌ని చెప్పారు. ఇక సెకండాప్ ఆరంభంలో హీరో టూర్‌లో తిరుగుతూనే క‌న‌ప‌డ‌టం.. సినిమాలో ఎక్క‌డా కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌దు. స్పీడ్ ఉండ‌ద‌ని కూడా కొంద‌రు చెప్పారు. ఇక హీరో విజ‌య్ యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. కొంద‌రు డియ‌ర్ కామ్రేడ్ కంటే డియ‌ర్ క్రికెట్ అని టైటిల్ పెట్టుకోమ‌ని స‌ల‌హా ఇస్తున్నారు. ఏదేమైనా మిక్స్‌డ్ టాక్‌తో సినిమా ర‌న్ స్టార్ట్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news