Moviesడియర్ కామ్రేడ్ ఫస్ట్ డే కలక్షన్స్..!

డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే కలక్షన్స్..!

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి నిర్మించారు. శుక్రవార రిలీజైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లొ ఈ సినిమా రిలీజైంది.

సినిమాకు రిలీజ్ ముందు భారీగా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగినట్టుగానే మొదటి రోజు చాలా చోట్ల హౌజ్ ఫుల్ కలక్షన్స్ తో నడిచింది. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మొదటిరోజు 11 కోట్లను కలెక్ట్ చేసింది. విజయ్, రష్మికల జోడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో ఇద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఏరియావైజ్ డియర్ కామ్రేడ్ కలక్షన్స్ చూస్తే :

నైజాం : 3 కోట్లు

సీడెడ్ : 0.90 కోట్లు

వైజాగ్ : 0.89 కోట్లు

ఈస్ట్ : 0.90 కోట్లు

వెస్ట్ : 0.53 కోట్లు

కృష్ణ : 0.38 కోట్లు

గుంటూరు : 0.62 కోట్లు

నెల్లూరు : 0.26 కోట్లు

ఏపి/తెలంగాణ : 7.48 కోట్లు

ఓవర్సీస్ : 1.40 కోట్లు

కర్ణాటక : 0.72 కోట్లు

కేరళ, తమిళనాడు : 1.30 కోట్లు

వరల్డ్ వైడ్ : 11.10 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news