రికార్డ్స్ బ్రేక్ చేసినా డియర్ కామ్రేడ్ బిజినెస్.. విజయ్ దేవరకొండ మేజిక్ రిపీట్..!

105

యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. కాకినాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మే 31న రిలీజ్ ప్లాన్ చేసిన డియర్ కామ్రేడ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం నైజాం, సీడెడ్ వరకు 11 కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. నైజాంలో ఏషియన్ సునీల్ నారంగ్ 7 కోట్లకు డియర్ కామ్రేడ్ హక్కులు పొందారట. ఇక ఆంధ్రాలో కూడా 10 కోట్ల బిజినెస్ చేసిందట. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బిజినెస్ భారీగానే చేస్తుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ టోటల్ బిజినెస్ గా 40 నుండి 50 కోట్ల దాకా చేస్తుందని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో మరోసారి తన మేజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు.

గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హాట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి డియర్ కామ్రేడ్ లో నటిస్తున్నారు. మరి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. టీజర్ చూసిన తర్వాత సినిమా విజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ కొట్టేలా ఉంది.

Leave a comment