Specialsబిగ్ బాస్ షోలో రానా ....మరి ఎన్టీఆర్...?

బిగ్ బాస్ షోలో రానా ….మరి ఎన్టీఆర్…?

ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ షో టీవీ రేటింగ్స్‌లో ముఖ్యంగా స్టార్ మా టీవీ సంచలనాలు సృష్టిస్తోంది. 14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్‌ బాబు, జ్యోతి, మధుప్రియ నిష్క్రమించగా హౌస్ మేట్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే ‘బంతిపూల జానకి’ సినిమా ఫేం దీక్షా పంత్‌ వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ షోలో మరో సెలబ్రిటీ కనిపించబోతున్నట్టు ఊహాగానాలు.

హీరో గా,విలన్ గా, యాంకర్‌గా అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించిన దగ్గుబాటి రానా బిగ్‌బాస్‌ షోలో ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఎన్టీఆర్‌తోపాటు రానా ఇందులో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ నుంచి పూణే బయలుదేరారు. అయితే ఇందులో రానా వెళ్లేది మిగతా సభ్యులతో కలిసి ఆడటానికి మాత్రం పప్పులో కాలేసినట్లే. బిగ్‌బాస్‌ షో కార్యక్రమం ద్వారా త్వరలో విడుదల కానున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా రానా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news