వర్షిణి డ్యాన్స్ కు ఫిదా అయిన ఎన్టీఆర్..!

28

ఈటివి డ్యాన్స్ షో ఢీ 10 గ్రాండ్ ఫైనల్స్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలిసిందే. ఫైనల్స్ రెండు పార్టులుగా విడగొట్టి ఫైనల్ గా ఢీ 10 ఫైనల్ ఎపిసోడ్ కు ఎన్.టి.ఆర్ వస్తున్నాడు. అయితే ఇద్దరు డ్యాన్సర్స్ మాత్రమే ఫైనల్ లో చేరారు. అయితే వారిద్దరు కేవలం రెండు సాంగ్స్ మాత్రమే డ్యాన్స్ చేస్తారు. సో అలా చేయడం వల్ల మొత్తానికి ఓ 20 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది.

అయితే తారక్ వచ్చాడు కాబట్టి డ్యాన్సులు, డైలాగులు తప్పనిసరి ఇవే కాకుండా వర్షిణి మైకెల్ జాక్సన్ డ్యాన్స్ కూడా వేయించారు. అయితే ఆ డ్యాన్స్ చూసి ఎన్.టి.ఆర్ పడి పడి నవ్వేశాడు. అసలు డ్యాన్స్ అంటే ఇదని చెప్పడం విశేషం. వర్షిణిని ఆడుకునే క్రమంలో ఎన్.టి.ఆర్ అన్న మాటలు ప్రస్తుతం ప్రోమోలో ఉండటంతో అది నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Leave a comment