ఎన్టీఆర్ పై త్రివిక్రమ్ కొత్త ప్లాన్..!

ntr-trivikram-movie-details

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాకు త్రివిక్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈస్జా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు లిమిటెడ్ బడ్జెట్ నే కేటాయిస్తున్నారట.

త్రివిక్రం డైరక్షన్ లో నితిన్ తో తీసిన అఆ సినిమాకే 35 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. మరి ఇక్కడ యంగ్ టైగర్ సినిమా 50 కోట్లు దాటాల్సిందే అనుకుంటుండగా త్రివిక్రం సినిమాకు కాస్ట్ కటింగ్, బడ్జెట్ లిమిటేషన్స్ అంటూ లెక్కలు వేసుకున్నాడట. అజ్ఞాతవాసి సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు దీనికి అసలు రిపీట్ అవకూడదని ముందు నుండే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అరవింద సమేత టైటిల్ లో కాస్త త్రివిక్రం మార్క్ కనిపిస్తున్నా ఇది పక్కా ఎన్.టి.ఆర్ మార్క్ సినిమాగా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట. అందుకే ఫస్ట్ లుక్ లోనే మాసీగా కనిపించాడు తారక్. సినిమాలో అనవసరమైన బడ్జెట్, టైం వేస్ట్ చేయకుండా సినిమా అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట.

Leave a comment