బాలయ్య తో ఆఫర్ ని రిజెక్ట్ చేసిన పూరి …

posani krishna murali balakrishna fire

పూరి జగన్నాధ్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పైసా వసూల్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫలితం మాత్రం నిరాశ పరచింది. ఇక ఈ సినిమాలో తనకు పూరి పిలిచి మరి అవకాశం ఇస్తానన్నా తాను మాత్రం వద్దు పొమ్మనానని అన్నారు రచయిత దర్శకుడు ప్రస్తుతం నటుడిగా స్థిరపడిన పోసాని కృష్ణ మురళి.

నటన పరంగా ఎలాంటి పాత్రనైనా చాలెంజింగ్ గా తీసుకుని చేస్తా అంటున్న పోసాని తనకు నైట్ షూట్స్ అంటే మాత్రం నో నో అనేస్తున్నాడు. తనకు తన కుటుంబం, తన ఆరోగ్యం చాలా ముఖ్యమని.. ఎన్ని డబ్బులు సంపాదించినా వీటిని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. పైసా వసూల్ కోసం పూరి 14 రోజులు నైట్ షూట్ కోసం కాల్ షీట్ అడుగగా తాను సున్నితంగా తిరస్కరించానని అంటున్నారు పోసాని. ఎక్కువ డబ్బులు ఇస్తారని నైట్ షూట్ కు వెళ్తే అంతకు అంత ఖర్చు అవుతుందని తనకు రాత్రి వేళల్లో 7-8 గంటలు నిద్ర పోవడం అలవాటని ఒకవేళ అలా నిద్ర పోకపోతే మరుసటి రోజు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.

పూరి తీసిన టెంపర్ సినిమాలో పోసాని స్పెషల్ పాత్రలో చేశాడని తెలిసిందే. అలాంటి మంచి పాత్ర ఇచ్చి తన కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చినా సరే నైట్ షూట్స్ అంటే మాత్రం తాను వచ్చేది లేదు అంటున్నాడు పోసాని. ఆయన్ను అర్ధం చేసుకుని అలా రాకున్నా సరే అవకాశాలు ఇస్తున్నారని అంటున్నారు.

Leave a comment