దారుణం.. క్రికెటర్ భార్యని జుట్టుపట్టి లాక్కెళ్ళిన కానిస్టేబుల్..!

jejas-wife

ఇండియన్ క్రికెటర్ రవింద్ర జడేజా భార్యను జుట్టుపట్టి లాక్కెళ్లాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. సంచలనంగా మారిన ఈ సంఘటన గురించి ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం ప్రకారం గుజరాత్ జాం నగర్ లోని జడేజా భార్య రీవా సోలంకి కారు అదుపుతప్పి ఓ కానిస్టేబుల్ బైక్ ను ఢీ కొట్టింది. దానితో కోపంతో ఊగిపోయిన ఆ కానిస్టేబుల్ ఆమెను జుట్టుపట్టి ఈడ్చుకెళ్తూ మరి దాడి చేశాడట.

ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం కేవలం కారు వచ్చి బైక్ ను గుద్దినందుకు మాత్రమే ఆ పిసి ఈ రేంజ్ లో దాడి చేయడం జరిగిందట. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఎస్పి ప్రదీప్ సెజుల్ ఆర్డర్ వేశారు. బాధ్యతాయుత పోలీస్ వృత్తిలో ఉండి కూడా సజయ్ అహిర్ చేసిన పనికి మొత్తం పోలీసు వృత్తికే అవమానం కలిగేలా చేశాడు.

మహిళలను కాపాడాల్సిన రక్షక భటులే ఇలా దాడి చేయడం పట్ల అందరు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. తన భార్యపై జరిగిన దాడికి రవింద్ర జడేజా కూడా అప్సెట్ లో ఉన్నాడని తెలుస్తుంది. దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేయించారు కూడా. అతనిపై కేసు పెట్టడం జరిగింది.

Leave a comment