సినీ ఇండస్ట్రీ లో మరో విషాదం..! కమెడియన్ మహేష్ కన్నుమూత..!

comedian mahesh died

కమెడియన్ మహేష్ అనగానే జబర్దస్త్ నుండి వచ్చి రీసెంట్ గా రంగస్థలం లో రాం చరణ్ పక్కన ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన బక్క మహేష్ గుర్తొస్తాడు. అయితే అతను కాకుండా వేరే కమెడియన్ మహేష్ ఉన్నాడు ఆయనే సీరియల్ మహేష్. పలు సీరియల్స్ లో కామెడీ పాత్రలు వేస్తూ అడపాదడపా సినిమాల్లో నటించే మహేష్ మృతి చెందారు.

కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహేష్ కిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలుస్తుంది. సీరియల్స్, సినిమాల్లో మహేష్ అంటే మంచి గుర్తింపు ఉంది. ఆయన మృతి పట్ల సిని పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది. పలువురు సిని ప్రముఖులు మహేష్ ఫ్యామిలీకి తమ సానుభూతిని తెలియచేశారు.

mahesh

Leave a comment