Gossipsకన్నడ స్టార్ హీరోలకు బెదిరింపులు..!

కన్నడ స్టార్ హీరోలకు బెదిరింపులు..!

కన్నడు నాట రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోలను స్థానిక ఎమ్మెల్యే బెదిరించడం పై సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత స్వతంత్ర్య అభ్యర్థిగా మాండ్య లోక్ సభ సీటు నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.. అంబరీష్ స్వస్థలమైన ఈ సీటును కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఆమె రెబల్ గా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆమెకు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్నారు సినీ స్టారు. అయితే వీరిలో కన్నడ స్టార్ హీరోలు దర్శన్ – యష్ లు ప్రత్యక్షంగా ఆమె వెంట ఉండి ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆమె నామినేషన్ కు హాజరై మద్దతుగా ప్రచారం కూడా చేస్తామన్నారు. వారు అలా చేయడం జేడీఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఇదే స్థానం నుండి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నందున సీటుకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే వీరికి ఉన్న క్రేజ్ చూసి హడలి పోయిన కె.ఆర్.పేటకి చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణగౌడ ఇరువురి హీరోలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

యష్, దర్శన్ లు ఇదే విధంగా ప్రవర్తిస్తే వారికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తాజాగా ఈ హెచ్చరికలపై ‘నమ్మ కర్ణాటక రక్షణ వేదిక’ అధ్యక్షుడు జయరాజ్ నాయుడు బృందం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దర్శన్ – యష్ లు ప్రచారం చేస్తారని.. వారి సినిమాలకు ఎన్నికల కోడ్ వర్తింప చేయకుండా విడుదల చేసేలా అనుమతివ్వాలని కోరారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news