Gossipsచరణ్.. బన్ని.. గొడవపై స్పందించిన మెగా హీరో..!

చరణ్.. బన్ని.. గొడవపై స్పందించిన మెగా హీరో..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు మంచి స్టార్ లీగ్ లో ఉన్న యాక్టర్స్.. అన్నిటికన్నా ఇద్దరు మెగా హీరోలు.. మెగాస్టార్ వారసుడిగా చరణ్.. మెగా ప్రొడ్యూసర్ తనయుడిగా అల్లు అర్జున్ ఇద్దరు సూపర్ ఫాంలో ఉన్నారు. అయితే ఎంత ఒకే ఫ్యామిలీ హీరోలైనా ఒక స్టేజ్ దాటాక ఎవరికి వారు గ్రేట్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి ఫీలింగే చరణ్, బన్నిలకు వచ్చిందని.. అందుకే ఒకరి సినిమా గురించి మరొకరు మాట్లాడటం లేదని వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు మరో మెగా హీరో.. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్. చరణ్, బన్ని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని.. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. అనవసరంగా మీరే వాటిని సృష్టిస్తున్నారని అన్నాడు శిరీష్. అంతేకాదు వారు రెగ్యులర్ గా కలుస్తుంటారని.. యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం ఇలాంటి వార్తలు రాస్తారని.. వాటికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వారికి లేదని అన్నాడు అల్లు శిరీష్.

అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఏబిసిడి లాస్ట్ ఫ్రై డే రిలీజైంది. సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అవగా అంచనలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. సినిమాలో శిరీష్ నటనకు మంచి మార్కులే పడినా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది డౌట్ గానే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news