ముదిరిన వివాదం…దిల్ రాజుపై భానుమతి సీరియస్..!

clash between sai pallavi and dil raju

మలయాళ ప్రేమం సినిమాతో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. భానుమతిగా అమ్మడి అభినయానికి ఇక్కడ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత వచ్చిన నాని ఎం.సి.ఏ సినిమా కూడా ఆమె ఖాతాలో హిట్ గా నిలిచింది. అయితే హిట్ కొడుతున్న సాయి పల్లవి కాస్త ఈగోయిస్ట్ గా మారిందని టాక్.

ఎం.సి.ఏ షూటింగ్ టైంలో నానికి, సాయి పల్లవికి మధ్య గొడవ కూడా జరిగిందట. మొత్తానికి దిల్ రాజు ఎలా గోలా సెట్ చేసి సినిమా అయ్యేలా చేశాడు. అయితే ఫిదా టైంలోనే సాయి పల్లవితో 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నాడట. అయితే ఆమె ప్రవర్తన నచ్చక 3వ సినిమా చేయాల్సి ఉన్నా సరే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారట. అసలైతే దిల్ రాజు బ్యానర్లో సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారట.

కాని సాయి పల్లవి కాస్త ఇబ్బంది పెడుతుందని ఆమె ప్లేస్ లో పూజా హెగ్దెకి ఛాన్స్ ఇచ్చారట. నాని ఎం.సి.ఏ లో సెకండ్ హాఫ్ లో సాయి పల్లవి కొన్ని సీన్స్ కావాలని ట్రిం చేశారని ఇన్ సైడ్ టాక్. ఆ విషయంలో కూడా సాయి పల్లవి బాగా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి దిల్ రాజు రేంజ్ ఏంటో తెలుసుకోలేని సాయి పల్లవి అతని నిర్మాణం నుండి బయటకు రావడం ఓ రకంగా బ్యాడ్ న్యూసే అని చెప్పొచ్చు.

Leave a comment