Movies370 ఆర్టికల్ రద్దుపై సినీ తారల స్పందన..!

370 ఆర్టికల్ రద్దుపై సినీ తారల స్పందన..!

దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు నరేంద్ర మోడీ ఒకే ఒక వారం వ్యవధిలో ముగించేశారు. కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. భారత మొదటి ప్రధాని నెహ్రూ సమయంలో జరిగిన ఈ ఒప్పందాం పై అప్పటి నుంచి ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్ 370 నిర్ణయంతో జమ్మూ-కాశ్మీర్ లో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి.

ఇది భారతీయులకు నెహ్రూగారి చేదు బహుమతి…. ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి.జమ్ము-కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది.జమ్ము-కాశ్మీర్ జాతీయ పతాకం భిన్నంగా ఉంటుంది.జమ్మూ-కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని లేదా జాతీయ చిహ్నాలను అవమానిస్తే నేరం కాదు!జమ్మూ – కాశ్మీర్లో భారత సుప్రీంకోర్టు యొక్క ఆదేశం చెల్లుబాటు కాదు. ఇలా ఎన్నో విషయాలో భారత్ లో ఉంటూనే భారత్ కి వ్యతిరేక సంస్కరణలు చేయడం జరిగింది అప్పట్లో.

అయితే దీనిపై పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మీద వేర్వేరుగా 4 బిల్లులను పాస్ చేయడం గమనార్హం. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్, లడఖ్ రెండు వేరు వేరు కేంద్ర ప్రాంతాలుగా గుర్తింపు పడతాయి.

తాజాగా ఈ 370 ఆర్టికల్ రద్దు పై సినీ ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు:
మెహర్ రమేష్ : జమ్మూ కాశ్మీర్ మీద వేర్వేరుగా 4 బిల్లులను పాస్ చేయడం గమనార్హం. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్, లడఖ్ రెండు వేరు వేరు కేంద్ర ప్రాంతాలుగా గుర్తింపు పడతాయి.
నిర్మాత ఎస్.కె.ఎన్ :
ఇక నుంచి కాశ్మీర్లో భారత్ జెండాను కించ పరిస్తే బ్యాండు బాజా వాయిస్తారని ట్వీట్ చేశారు.
లావణ్య త్రిపాఠి : ఇక ఆర్టికల్ 370 రద్దు పై లావణ్య త్రిపాఠి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని, నాకు చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
మంచు విష్ణు : 370 ఆర్టికల్ రద్దు అనేది చారిత్రాత్మక నిర్ణయం..జై భారత్ మాతాకీ అంటూ ట్విట్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news