హ్యాట్సాఫ్ క్రిస్ గేల్.. అసలైన ఆటగాడివి నువ్వు..!

chrish-gayle

అసలే టఫ్ మ్యాచ్.. గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు అయినా సరే నిజమైన ఆటగాడిగా తన నిజాయితీ చాటుకున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ క్రిస్ గేల్. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన నిన్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు భారీ లక్ష్యం కోసం ముందు నుండి ఎటాకింగ్ గా ఆడాలనుకుంది. మొదటి ఓవర్ ఎలాగోలా పూర్తి చేయగా రెండో ఓవర్ క్రిస్ గేల్ వికెట్ తీసుకుంది.

చెన్నై ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి ఫేసిన బంతి క్రిస్ గేల్ గ్లౌసెస్ కు తగులుకుంటూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే అది అవుట్ అని బౌలర్ అప్పీల్ చేయగా ఏమి స్పందించలేదు. కాని క్రీజ్ లో ఉన్న క్రిస్ గేల్ మాత్రం తనకు తానుగా అది తన గ్లౌసెస్ కు తగిలిందని ఒప్పుకుని పెవిలియన్ బాట పట్టాడు. క్రిస్ గేల్ నిజాయితీకి అతనికి చెన్నై ఆటగాళ్లు చప్పట్లతో అభినందనలు తెలిపారు.

ఒకవేళ క్రిస్ గేల్ నిజంగానే కేవలం తన స్వార్ధం కోసం ఆడి ఉంటే పంజాబ్ భారీ స్కోర్ చేసేదేమో. జరిగిన మ్యాచ్ లో పంజాబ్ చెన్నై చేతిలో ఓడిపోయి ఐపిఎల్ నుండి నిష్క్రమించింది.

Leave a comment