కాజల్ పరువు తీసిన నాయుడు.. పబ్లిక్‌గా ముద్దులే ముద్దులు..!

61

అందాల భామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూకుడుగా వెళుతోంది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ సినిమాలు చేస్తుంది. అయితే కాంట్రోవర్సీలకు చాలా దూరంగా ఉండే మన చందమామ నాయుడు గారి దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయి నోరెళ్లబెట్టింది. ఇంతకీ ఈ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండీ.
3
తాజాగా కాజల్ హీరోయిన్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కవచం చిత్ర టీజర్ లాంచ్ చాలా గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ అందరూ హాజరయ్యారు. అయితే స్టేజీపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాజల్‌ను పొగిడేస్తూ ఆమెను కిస్ చేయడం మన వల్ల కాదు.. కేవలం హీరోలకు మాత్రమే సాధ్యం అంటూ ఒక సెటైర్ వేశాడు. అక్కడే ఉన్న సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ‘మన వల్ల ఎందుకు కాదు..’ అంటూ తన తడాఖా చూపించి వెంటనే వెళ్లి కాజల్‌ను ముద్దు పెట్టుకున్నాడు. ఇది చూసి అక్కడ ఉన్న వారు అందరూ షాక్. అయితే తామంతా ఒక కుటుంబం లాంటి వారు అంటూ కాజల్ కవర్ చేసింది.
2
ఏదేమైనా కాజల్‌ను అంత పబ్లిక్‌గా ముద్దు పెట్టేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు నాయుడు. పాపం కాజల్.. ఏం మాట్లాడాలో తెలీక ఎలాగోలో నెట్టుకొచ్చేసింది. హీరోగారు మాత్రం ఆ సమయంలో కవచంలా ఆమెను కాపాడలేకపోయాడు.

Leave a comment