Newsమెగా స్టార్ చిరంజీవి కి భారీ షాక్ ఇచ్చిన "అపరిచితుడు" విక్రమ్

మెగా స్టార్ చిరంజీవి కి భారీ షాక్ ఇచ్చిన “అపరిచితుడు” విక్రమ్

శివ పుత్రుడు సినిమాతో మన తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టి అపరిచితుడు సినిమాతో ఏకంగా స్టార్ గా ఎదిగాడు విక్రమ్. ఇక తన లేటెస్ట్ మూవీ “సామి స్వ్కేర్ ” మోష‌న్ పోస్ట‌ర్ తో ఇండియన్ సినిమా రికార్డులనే తిరగరాస్తోన్నాడు. మెగాస్టార్ చిరంజీవి సైరా మోషన్ పోస్టర్ కి 74 వేల లైకులు వచ్చి రికార్డు నెలకొల్పగా ఇప్పుడు విక్రమ్ “సామి స్వ్కేర్ ” మోష‌న్ పోస్ట‌ర్ 93 వేల లైకులతో దుమ్ము రేపుతున్నాడు. అయితే వ్యూస్ విషయంలో మాత్రం మన మెగాస్టారే ముందు ఉన్నాడు. “సామి స్వ్కేర్ ” మోష‌న్ పోస్ట‌ర్ కి ఇప్పటివరకు దాదాపు 32 లక్షల వ్యూస్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి సైరా మాత్రం 42 లక్షలకి పైగా వ్యూస్ తెచ్చుకొని నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సామి స్క్వేర్ సినిమా 14 సంవత్సరాల క్రితం వచ్చిన సామి సినిమాకు సీక్వెల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news