మెగా ఫ్యామిలీ వద్దు.. ఎన్టీఆర్ ముద్దు అంటున్న మెగా హీరో..

119

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నటించిన చిత్రలహరి సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ మొదటి వారంలో ప్లాన్ చేశారు. ఇక ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్టుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అటెండ్ అవుతాడని తెలుస్తుంది. ఒకప్పుడు మెగా, నందమూరి హీరోలకు అసలు పడేది కాదు కాని ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల స్నేహం పరిస్థితులను మార్చేసింది.

తారక్, చరణ్ ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ మెగా హీరో ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ వస్తున్నాడు. చరణ్ తన షెడ్యూల్ లో బిజీగా ఉండటం వల్ల సాయి తేజ్ కోసం తారక్ వస్తాడని తెలుస్తుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న తేజూ ఈ చిత్రలహరి మీద గురి పెట్టి ఉన్నాడు. కచ్చితంగా ఈ సినిమా హిట్ కొడుతుందని చెబుతున్నాడు.

సాయి ధరం తేజ్ గా ఉన్న అతను సాయి తేజ్ గా పేరు మార్చుకుని మరి చిత్రలహరి చేశాడు ఈ మెగా హీరో. మరి తేజ్ ఈవెంట్ లో తారక్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది. ఆ వేడుకలో ఎన్.టి.ఆర్ ఏం మాట్లాడతాడు. తారక్ గురించి తేజూ ఏం చెబుతాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Leave a comment