చిరు – ఎన్టీఆర్ – మ‌హేష్ యుద్ధం… ఆ ఒక్క‌డి కోస‌మే..

33

తొలి సినిమా మిర్చి నుంచి శివ వరుసపెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీస్తున్నారు. ఎన్టీఆర్‌తో జ‌న‌తా గ్యారేజ్ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల… మహేష్ బాబుకు శ్రీమంతుడు – భరత్ అనే నేను లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే చిరంజీవి 152వ ప్రాజెక్టును సైతం డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. కొరటాల చేసిన నాలుగు సినిమాలు ఒకదానిని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. దీనికితోడు మినిమం గ్యారెంటీ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో ఆయనకు పేరు వచ్చేసింది. దీంతో టాలీవుడ్లో టాప్ హీరోలందరూ తమకు ఖ‌చ్చితంగా హిట్ కావాలంటే కొర‌టాలే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ఆయనతో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అందుకే మెగాస్టార్ ఇలాంటి వాడు సైతం సైరా లాంటి క్రేజీ ప్రాజెక్టు తర్వాత కొరటాల శివతోనే కమిట్ అయ్యాడు. ఇక చిరు ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే కొరటాలతో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఆస‌క్తితో ఉన్నాడు. ఎన్టీఆర్ ఈ లోగా రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసుకున్న వెంట‌నే కొర‌టాల‌తో చేయాల‌ని మ‌నోడిపై ఒత్తిడి చేస్తున్నాడ‌ట‌. ఇక మ‌హేష్ కూడా చిరు ప్రాజెక్ట్ అయిన వెంట‌నే త‌న‌తోనే చేయాల‌ని కొర‌టాల‌ను అడుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌హేష్‌కు కొర‌టాల ఇప్ప‌టికే రెండు సూప‌ర్ హిట్లు ఇచ్చాడు. శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను రెండు విజ‌య‌వంత‌మ‌య్యాయి. న‌మ్ర‌త‌తో కూడా కొర‌టాల‌కు మంచి రిలేష‌న్ ఉంది. గ‌తంలో మ‌హేష్ శ్రీమంతుడు త‌ర్వాత రెండు వ‌రుస ప్లాపుల‌తో ఉన్నప్పుడు కొర‌టాల‌తో ప‌ట్టుబ‌ట్టి మ‌రీ భ‌ర‌త్ చేయించింది న‌మ్ర‌తే అన్న టాక్ ఉంది. అందుకే సైరా త‌ర్వాత మ‌హేష్‌తో ఓ సినిమా చేయాల‌ని ఆమె అడుగుతోంద‌ట‌. ఏదేమైనా కొర‌టాల‌తో సినిమా చేసేందుకు ఏకంగా ముగ్గురు టాప్ హీరోలో లైన్లో ఉన్నారంటే మ‌నోడి డిమాండ్ ఏంటో తెలుస్తోంది.

Leave a comment