‘ఖైదీ’ టీజర్ టాక్ : స్వీట్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

chiranjeevi khaidi no 150 teaser talk

Finally the wait is over. Here is the first teaser of Megastar Chiranjeevi’s prestigeous project Khaidi No 150 has released. In this teaser chiru looks in very new and young getup mesmerised with his acting skills after nine years long gap also.

మెగాస్టార్ చిరంజీవి మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్న మెగాఫ్యాన్స్, టాలీవుడ్ జనాలకు ఆ సమయం రానే వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే కొణిదెల ప్రొడక్షన్స్‌వారు ‘ఖైదీ నెంబర్ 150’కి సంబంధించి ఈరోజు (08-12-2016) సాయంత్రం 6 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. పదండి.. ఇన్నాళ్ళూ ఊరిస్తూ వస్తున్న ఈ టీజర్‌ ఎలాగుందో తెలుసుకుందాం..

తొమ్మిదేళ్ల తర్వాత చిరు చేస్తున్న చిత్రం కాబట్టి.. ఇందులో ఆయన్నే ప్రతి ఫ్రేమ్‌లో హైలైట్ చేస్తూ చూపించారు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలయ్యే ఈ టీజర్‌లో.. చిరు సరికొత్త గెటప్‌లో చాలా యంగ్‌గా, అచ్చం ఖైదీలా ప్రవర్తిస్తూ కనిపించారు. ఆ నడక, ఆ ఠీవీ, ఆ చరిష్మా.. అబ్బో అదిరిపోయాయి అంతే. 60 ఏళ్ల వయస్సులోనూ అందరికీ ఈర్ష కలిగేలా స్టైలిష్‌గా కనువిందు చేశారు చిరు. ఇక ఇందులో ఆయన ఎప్పటిలాగే తన సూపర్బ్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను.. నచ్చితేనే చూస్తాను.. కాదని బలవంతం చేస్తే.. కోస్తా’ అంటూ స్వీట్ వార్నింగ్ చ్చారు. ఓవరాల్‌గా.. చిరు చించేశారంతే.

ఇక టెక్నికల్‌గా చూస్తే.. వినాయక్ టేకింగ్ ఎలాగుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాస్ సినిమాల్ని తెరకెక్కించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఈ విషయాన్ని ‘ఖైదీ’ టీజర్‌తోనే మరోసారి నిరూపించాడు. అభిమానులకు ఏదైతే కోరుకున్నారో.. అదే టీజర్‌లో చూపించి మెప్పించాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఈ టీజర్‌కి మరో హైలైట్. ‘ఖైదీ నెంబర్ 150’ అంటూ వినిపించే సాంగ్ అలాగే హమ్మింగ్ చేయాలనిపిస్తుంది. దీన్ని ఎడిట్ చేసినవారికి మంచి మార్కులు వేయాల్సిందే. ఓవరాల్‌గా.. ఫ్యాన్స్‌కి ‘ఖైదీ’ బ్రహ్మాండమైన ట్రీట్ ఇచ్చాడు.

Leave a comment