Moviesరంగస్థలానికి రిపేర్లు చేయాలనీ మెగాస్టార్ ఆదేశం ..?

రంగస్థలానికి రిపేర్లు చేయాలనీ మెగాస్టార్ ఆదేశం ..?

టాప్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో చెర్రీ హీరోగా రాబోతున్న సినిమా పూర్తి పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించిన ఫోటోలు చూస్తుంటే ఆ సినిమా మీద భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా ఎలా ఉండబోతుందో అందరూ ఎవరికీ నచ్చిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అప్పుడే ఎదురు చూపులు చూడడం మొదలెట్టేసాడు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త చెక్కెర్లు కొడుతోంది.

ఈ సినిమా రషెస్ ను చెర్రీ కోరిక మేరకు చుసిన చిరు అసంతృప్తి వ్యక్తం చేసాడట. ఒకరకంగా సుకుమార్ కి గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అనవసర పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయని , దీనివల్ల ఆ సినిమా చూసే సమయంలో ప్రేక్షకులకు విసుగొచ్చే అవకాశం ఉన్నట్టు చిరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఎక్కడెక్కడ సీన్లు మార్చాలో అనే అంశంపై చిరు సూచనలు చేసాడట.

చిరు చెప్పిన విషయాలను అంగీకరించిన దర్శకుడు సుకుమార్ మళ్ళీ ఆ సీన్లను రీ షూట్ చేస్తానని చెప్పాడట. ఈ చిత్రాన్ని మార్చ్ నెలాఖరుకు విడుదల చేసేందుకు ఇప్పటికే ఆ చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. అయితే ఈ మార్పు చేర్పుల కారణంగా విడుదల తేదీ ఏమైనా మార్చే అవకాశం ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news