Gossipsబయోపిక్ కు అడ్డు తగులుతున్న మెగా అభిమనులు..?

బయోపిక్ కు అడ్డు తగులుతున్న మెగా అభిమనులు..?

బాలకృష్ణ లీడ్ రోల్ గా వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్ సిని రాజకీయ విషయాలకు సంబందించి అన్ని విషయాలను ఇందులో ప్రస్థావించే అవకాశం ఉంది. ఇక సినిమాలో ఇప్పటికే చాలా మంది నటీనటులను ఎంపిక చేయగా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మెగాస్టార్ చిరంజీవి రోల్ ఎవరు చేస్తున్నరు అన్న విషయంపై కన్ ఫ్యూజన్ మొదలైంది.

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో చిరంజీవికి స్థానం కల్పించడం మంచి విషయమే అయితే చిరు రోల్ లో ఎవరు నటిస్తారు. రాం చరణ్ బిజీ కాబట్టి చేసే వీలు లేదు. అందుకే వరుణ్ తేజ్ ను చిరుగా కనిపించాలని అడిగారట. వరుణ్ తేజ్ ముందు ఓకే అన్నట్టు చెప్పినా మెగా ఫ్యాన్స్ తాకిడికి మళ్లీ సారీ అనేశాడట. ఇండస్ట్రీలో హీరోగా చిరు, బాలయ్య క్లోజ్ గా ఉంటున్నా బయట్ ఫ్యాన్స్ మధ్య మాత్రం గొడవలు అవుతూనే వస్తున్నాయ్.

ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ బయోపిక్ లో చిరంజీవి రోల్ కోసం వరుణ్ తేజ్ ను అడగటం మెగా ఫ్యాన్స్ కు నచ్చలే. క్రిష్ ఈ విషయం త్వరగానే గుర్తించి బయోపిక్ లో చిరంజీవి పోర్షన్ ను లేకుండా చేస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news