Newsఇన్నేళ్లకి నిజాయితీ గా తప్పు ఒప్పుకున్న చిరంజీవి..!!

ఇన్నేళ్లకి నిజాయితీ గా తప్పు ఒప్పుకున్న చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి క్రియేటివ్ కమర్షియల్ కలిసి చేసిన సినిమాలన్ని అద్భుతమైన హిట్లే. 80వ దశకంలో అప్పటిదాకా స్టార్ గా ఉన్న చిరంజీవిని మెగాస్టార్ ను చేసింది ఆ సినిమాలే. అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం లాంటి ఎన్నో సూపర్ హిట్లు కె. ఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవికి సాధించిన విజయాలున్నాయి. అలాంటి క్రేజీ ప్రొడ్యూసర్ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా తేజ్ ఐలవ్యూ.

కరుణాకరణ్ డైరక్షన్ లో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఇది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. తాను కేవలం కె.ఎస్ రామారావు మీద ఉన్న అభిమానంతో వచ్చానని అన్నారు చిరంజీవి.

ఇక ఈ టైంలో అప్పటి రోజులకు గుర్తుచేసుకున్నారు చిరు. కె.ఎస్ రామారావు విషయంలో తానో తప్పు చేశానని అది సభాముఖంగా చెప్పి తీరాల్సిందే అని అన్నారు చిరు. స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ డైరక్షన్ వద్దని రామారావు చెప్పగా చిరు మాత్రం ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఎలాగోలా ఒప్పించారట. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అది నా తప్పే అని ఒప్పుకున్నారు చిరంజీవి. సందర్భం ఎలాంటిదైనా చిరు తన వల్ల రామారావుకి నష్టం వచ్చిందని ఒప్పుకోవడం గొప్ప విషయమని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news