కార్తి ‘చినబాబు’ ట్రైలర్.. కుమ్మేశాడుగా..!

7

తమిళ హీరో అయినా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు కార్తి. అన్న సూర్య లానే తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగిన అంశాలను తన సినిమాలో ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం కార్తి హీరోగా పాండిరాజ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా చినబాబు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో కార్తి పంచె కట్టుతో క్రేజీగా ఉన్నాడు.

ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమాలో కార్తి సరసన సయేషా సైగల్ నటించింది. ఇమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా తమిళంలో సూర్య నిర్మించారు. ఇక తెలుగులో మిర్యాల రవిందర్ రెడ్డి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ మాత్రం అదిరిపోయేలా ఉండగా సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ను అలరించేలా ఉంటుందని అంటున్నారు.

ఖాకి సినిమా తర్వాత కార్తి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈమధ్యనే ఈ సినిమా ఆడియో రిలీజ్ కు సూర్య, కార్తి హైదరాబాద్ లో సందడి చేశారు. మరి చినబాబుగా కార్తి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Leave a comment