కార్తి చినబాబు రివ్యూ & రేటింగ్

review-and-rating

తమిళ నటుడే అయిన తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్న కార్తి హీరోగా ఈరోజు రిలీజ్ అవుతున్న సినిమా చినబాబు. పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య ఈ సినిమా నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇద్దరు భార్యలున్న రుద్ర రాజు (సత్యరాజ్)కి ఐదుగురు కూతుళ్ల తర్వాత ఒక వారసుడు పుడతాడు. రుద్ర రాజు కొడుకు కృష్ణం రాజు (కార్తి) రైతుగా జీవనం సాగిస్తుంటాడు. రైతుగా కృష్ణం రాజు ఎనో ప్రీతిపాత్రంగా ఉంటాడు. అంతేకాదు రైతుల గురించి ప్రస్తుతం సమాజం చూస్తున్న చిన్న చూపు మీద కూడా మంచి అవగాహనతో ఉంటాడు. అలా నడుస్తున్న కృష్ణం రాజు జీవితం లోకి నీల (సయేషా సైగల్) వస్తుంది. ఆమెను ప్రేమించిన కృష్ణం రాజు ఆమెను పెళ్లాడాలని అనుకుంటాడు. అయితే ఇంతలోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఫ్యామిలీలో అందరు కృష్ణం రాజు ప్రేమని అంగీకరించరు. వారిని ఒప్పించి తనకు నచ్చిన అమ్మాయిని ఎలా పెళ్లాడాడు అన్నదే సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

కృష్ణం రాజుగా రైతు పాత్రలో కార్తి అదరగొట్టాడు. ఈమధ్య సూర్య తెలుగులో కాస్త ఫాం కోల్పోయినట్టు కనిపించగా కార్తి మాత్రం వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. రైతుగా నటించడమే కాదు రైతు యొక్క గొప్పతనం గురించి కార్తి చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక హీరోయిన్ సయేషా సైగల్ పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. సత్యరాజ్ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. దానితో పాటుగా ఎమోషన్స్ కూడా బాగా పండించారు. ఫ్యామిలీ మెంబర్స్ గా నటించిన వారంతా సహజ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసింది కాబట్టి సినిమాకు కెమెరా మెన్ వర్క్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ స్పెషల్ గా అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా అలరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. కథ, కథనాలు కొత్తగా ఏమి ఉండవు కాని సెంటిమెంట్ పాళ్లు కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

రైతు గొప్పతనం గురించి రైతు లేకుంటే దేశం ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఒకప్పుడు సినిమాలు వచ్చాయి కాని ఇప్పుడు రైతుల గురించి చెప్పే సాహసం ఎవరు చేయలేరని చెప్పాలి. కాని దర్శకుడు పాండిరాజ్ మంచి ప్రయత్నమే చేశాడు. లీడ్ హీరోని రైతుగా చూపించి పెద్ద సాహసమే చేశారు.

ఇక రైతు కుటుంబంలో ఉండే అప్యాయతలు.. అనురాగాలు.. కూడా చినబాబులో ఏమాత్రం లోటు లేకుండా చేశాడు. మొదటి భాగం రైతుల గురించి మంచి స్పీచ్.. ఎడ్ల బండి రేసులు అంతా సరదాగా సాగినట్టు అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ చేశారని చెప్పాలి. సెంటిమెంట్ పాళ్లు ఎక్కువై.. ఆడియెన్స్ పేషెన్సీని టెస్ట్ చేసినట్టు అవుతుంది.

ఇక సినిమా మొత్తం తమిళ నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. ఆర్టిస్టులు కూడా అక్కడి వారే కాబట్టి తెలుగు ఆడియెన్స్ ఓన్ చేసుకునే అవకాశం ఉండదు. ఫ్యామిలీ ఎమోషన్స్, రైతుల గొప్పతనం గురించి దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. కాని కథనం మాత్రం అలరించలేదు.

ప్లస్ పాయింట్స్ :

కార్తి

సత్యరాజ్

కామెడీ

డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

ఓవర్ సెంటిమెంట్

కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సింగ్

బాటం లైన్ :

కార్తి చినబాబు.. జస్ట్ ఓకే..!

రేటింగ్ : 2.75/5

Leave a comment